పార్లమెంట్‌లో ఆదాయపు పన్ను కొత్త బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. దశాబ్దాల కాలం నుంచి మనుగడలో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. మొత్తానికి ఇన్నాళ్లకు కేంద్రం కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్యే నిర్మలా సీతారామన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయగానే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది.
ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాల మొదటి రోజున సెలెక్ట్ కమిటీ నివేదికను సమర్పించనుంది. అయితే కొత్త మంది ప్రతిపక్ష సభ్యులు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్‌పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్‌లో రహస్యం ఏమీలేదు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండు దఫాలుగా నిర్వహిస్తున్నారు. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: MLC Kavitha: జనగామ జిల్లా ఏర్పడింది కేసీఆర్ కృషితోనే.. బీసీ బిల్లుల కోసం ఉద్యమం చేయాలి!