Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్‌కి ఆ రెండు దేశాల మద్దతు..
- పాకిస్తాన్‌కి మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్..
- ఆపరేషన్ సిందూర్‌ని ఖండిస్తూ ప్రకటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారీ ఎత్తున దాడులు చేసింది. భారత త్రివిధ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ భూభాగంతో పాటు పీఓకేలోని 09 చోట్ల భారత్ విధ్వంసం సృష్టించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కి చెందిన ఉగ్రవాదులు 100 మంది వరకు హతమయ్యారని తెలుస్తోంది.
అయితే, తాము పాక్ మిలిటరీ ఆస్తులపై, పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదని, కేవలం ఉగ్రవాదులు, వారి స్థావరాలను నాశనం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెప్పింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూకే, యూఎస్, ఫ్రాన్స్, చైనా, సౌదీ అరేబియా, జపాన్ దేశాల అధికారులతో మాట్లాడారు. ప్రపంచ సూపర్ పవర్స్‌తో పాటు కీలక దేశాలు అన్ని భారత్‌కి అండగా నిలుస్తున్నాయి.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
Read Also: Asaduddin Owaisi: వైమానిక దాడిలో ఉగ్రవాదుల హతం… అసదుద్దీన్ ఒవైసీ వీడియో వైరల్!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌కి అంతర్జాతీయంగా ఏకాకిగా మారినప్పటికీ కేవలం రెండు దేశాలు మాత్రమే పాక్ వైపు నిలుపుచున్నాయి. భారత్ దాడిని ఖండిస్తూ, పాకిస్తాన్‌కి టర్కీ, అజర్ బైజాన మద్దతు ప్రకటించాయి. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో ‘‘ పాకిస్తాన్, భారతదేశం మధ్య జరుగుతున్న పరిణామాలను మేము ఆందోళనతో గమనిస్తున్నాము. భారతదేశం నిన్న (మే 6) రాత్రి జరిపిన దాడి పూర్తి స్థాయి యుద్ధ ప్రమాదాన్ని పెంచుతుంది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులతో పాటు ఇటువంటి రెచ్చగొట్టే చర్యలను మేము ఖండిస్తున్నాము’’ అని పోస్ట్ చేసింది.
ఇక పాకిస్తాన్‌కి అజర్ బైజాన్ కూడా మద్దతు ప్రకటించింది. హింసను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరగడంపై అజర్ బైజాన్ ఆందోళన వ్యక్తి చేస్తోంది. పాకిస్తాన్ పై జరిగిన సైనిక దాడులను మేము ఖండిస్తున్నాము, ఇందులో అనేక మంది పౌరులు మరణించారు, గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలకు సంఘీభావంగా, అమాయక బాధితుల కుటుంబాలకు మేము సంతాపం తెలియజేస్తున్నాము, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము’’ అని ప్రకటనలో పేర్కొంది.
తాజావార్తలు
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!