మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధికారిక నివాసాన్ని వదిలి తన సొంతింటికి వెళ్లిపోయారు. అయితే.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌షిండే సీఎం ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యే షిండే శిబిరానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం మరో నలుగురు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలువడంతో మహారాష్ట్రలో రాజకీయా సంక్షోభం మరింతగా మారింది.
అయితే ఈ నేపథ్యంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. అస్సాంకు చెందిన టీఎంసీ చీఫ్ రిపున్ బోరా నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించిన బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ కార్యకర్తలు. వరదలతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు స్థానిక ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఆరోపించింది టీఎంసీ. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గౌహతిలో ఉన్నారు.