అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు.
మాయానగరి ముంబైలో నిర్మించిన జియో వరల్డ్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని యజమాని దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ. ఈ గార్డెన్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, మాల్స్, థియేటర్లు, గార్డెన్‌లోని పచ్చదనం దాని అందాన్ని మరింత పెంచుతాయి. ఇందులో ఇప్పటికే పలు పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.
Akash Ambani classy reply to Rohit Sharma’s Fans at IPL 2024 Auction: దుబాయ్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2024కు సంబదించిన వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ మినీ వేలం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో జరగ్గా.. భారీగానే అభిమానులు అక్కడకు వచ్చారు. అందులో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా చాలా మందే ఉన్నారు. ముంబై ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ వేలం అనంతరం బయటికి రాగానే.. ‘రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయండి’…
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుతుందని కంపెనీ తన బోర్డులో వారి నియామకానికి వాటాదారుల అనుమతిని కోరుతూ ఒక తీర్మానంలో పేర్కొంది.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఏ వ్యాపార అవకాశాన్ని కోల్పోకూడదనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలు మూడు రంగాలలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు.
Mukesh Ambani: ఆకాష్ అంబానీ, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భారతదేశంలో 5G స్పెక్ట్రమ్‌ను రూ. 88,078 కోట్లకు ధృవీకరించింది. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించారు.
భారతదేశ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటికి వారసురాలు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఆకాశ్ భార్య శ్లోకా బుధవారం ఓ ఆస్పత్రిలో పండంటి పాపకు జన్మినిచ్చారు.
Jio 5G: రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ఇవాళ రాజస్థాన్‌లో జియో 5జీ బీటా సర్వీసులను ప్రారంభించారు. రాజ్‌సమంద్‌లోని నాథద్వారాలో ఉన్న ప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబానీలకు ఈ దేవుడి పైన అపార నమ్మకం ఉంది. శ్రీనాథ్‌జీని తమ కుటుంబ దైవంగా కొలుస్తారు. గతంలో రిలయెన్స్ జియో 4జీ సర్వీసులను సైతం ఇక్కడే ప్రారంభించటం విశేషం.
RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్‌లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్‌లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది.