Centre appoints Lt General Anil Chauhan as India’s 2nd Chief of Defence Staff: భారతదేశ త్రివిధ దళాల సమన్వయకర్తగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవిని చేపట్టనున్నారు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్. హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోయిన 9 నెలల తర్వాత రెండో సీడీఎస్ గా అనిల్ చౌహాన్ ను నియమించింది కేంద్రప్రభుత్వం. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ మే 2021న ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విరమణ చేశారు.
Read Also: Study Abroad: ‘విదేశీ విద్య’ అంటే ఇండియాలో మేమే: Uni2Go కోఫౌండర్ రితికారెడ్డి
గతేడాది డిసెంబర్ లో తమిళనాడు కూనురు సమీపంలో నీలగిరి కొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చనిపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం అనిల్ చౌహన్ ను సీడీఎస్ గా నియమిస్తూ.. బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) భారత ప్రభుత్వ సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా పని చేయనున్నారు. భారతదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులను సమన్వయం చేసేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారత తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ ను నియమించింది.
తమిళనాడులోని ఓ ఆర్మీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో వెళ్తున్న సమయంలో తమిళనాడు నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.
అనిల్ చౌహన్ వివరాలు:
అనిల్ చౌహనా్ ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమిలో విద్య అభ్యసించారు. 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్ లో పనిచేశారు. మేజర్ జనరల్ గా అనిల్ చౌహన్ నార్తర్న కమాండ్ లోని క్లిష్టమైన బారాముల్లా సెక్టార్ లో పదాతిదళానికి నాయకత్వం వహించారు. లెఫ్టినెంట్ జనరల్ గా నార్త్ ఈస్ట్ లోని కార్ప్స్ కి నాయకత్వం వహించారు. సెప్టెంబర్ 2019లో తూర్పు కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేశారు. మే 2021లో సర్వీసు నుంచి పదవీ విరమణ చేశారు. తాజాగా సీడీఎస్ గా నియమించబడ్డారు.