Nepal : నేపాల్‌లో శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి చేరింది. హైవే మీదుగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి మర్స్యంగాడి నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంత్రుల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడింది. మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు.