Odisha: ఒడిశాలో పూరీ జగన్నాథ స్వామిని ఎంతగానో ఆరాధిస్తారు. ఇక స్వామీ వారికి ఇష్టమైన పర్వదినాలలో ప్రముఖ పూరీ జగన్నాథ ఆలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది. అలానే ఈ రోజు కూడా స్వామి వారికి ఎంతో ప్రీతీ కరమైన రోజు కనుక భక్తులు అధికసంఖ్యలో గుడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం ధన త్రయోదశి.. స్వామి వారికి ప్రీతికరమైన ధన త్రయోదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు పూరీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడిని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రణలోకి తీసుకు వచ్చారు.
Read also:Javed Akhtar: “హిందువులు సహనంతో ఉంటారు, వారి నుంచి నేర్చుకుంటున్నాం”.. జావేద్ అక్తర్ ప్రశంసలు..
గాయపడిన వారిని పూరీ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఒడియా పంచాంగం ప్రకారం.. కార్తిక మాసం గత పౌర్ణమి నుంచి ప్రారంభం అయింది. కాగా ఈ రోజు కార్తిక శుక్రవారం తో పాటుగా ధన త్రయోదశి కలిసి వచింది. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయాన్నే స్వామికి ఇచ్చే మంగళ హారతిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అందరూ ఒకేసారి ఆలయంలో పలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భక్తులు ఆలయం మెట్లపై పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కుకుంటూ వెళ్లారు. దీనితో పలువురికి గాయాలు అయ్యాయి.