Speaker Election: నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు..
- నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..
- బీజేపీ- కాంగ్రెస్ పోటాపోటీ వ్యూహాలు..
- 50 ఏళ్లలో తొలిసారిగా స్పీకర్ పోస్టుకు ఎన్నికలు..
- ఎన్డీయే తరుపున పోటీలో ఓం బిర్లా..
- ఇండియా కూటమి నుంచి కే.సురేష్ పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Election: నేడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని నామినేట్ చేశాయి. దీంతో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం ఎదురైంది. ఎన్డీయే తరుపున బీజేపీ ఎంపీ, మాజీ స్పీకర్ ఓం బిర్లను ప్రతిపాదించగా, ఇండియా కూటమి తరుపున కేరళకి చెందిన కాంగ్రెస్ ఎంపీ కే.సురేష్ పోటీ పడుతున్నారు.
తొలిసారిగా 1952లో లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మౌలాంకర్ స్పీకర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ విజయం సాధించారు. ఈ రెండింటి తరువాత ఇప్పడే తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు అనివార్యమమైంది. సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పోస్టును అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఈ సారి ప్రతిపక్షాలు తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబట్టాయి. అందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ఇరు పక్షాలు ఎన్నికలకు వెళ్లాయి.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
బలబలాలను పరిశీలిస్తే ప్రస్తుతం బీజేపీకి సొంతగా 240 ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 293 ఎంపీల సంఖ్యా బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బలం 297కి పెరిగింది. ఇక ఇండియా కూటమికి 233 ఎంపీల మద్దతు ఉంది. సభలో మొత్తం 543 సభ్యులు ఉంటే, ఇటీవల రాహుల్ గాంధీ వయనాడ్ సీటుకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 542 సభ్యులు ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు అవసరమైన ఓట్లు 271. బలాబలాలను పరిశీలిస్తే ఎన్డీయే పక్షం సునాయాసంగా స్పీకర్ పోస్టుని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో స్పీకర్ పోటీ ప్రతిపాదన చిచ్చు పెట్టింది. ఏకపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించిందని తృణమూల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!