Kia Syros: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కార్ మేకర్స్ కొత్త కొత్త మోడళ్లలో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న 2025లో స్వదేశీ, విదేశీ కంపెనీల నుంచి కొత్త మోడల్ కార్లు రిలీజ్ కాబోతున్నాయి.
తాజాగా కియా ఇండియా తన మూడో ఎస్‌యూవీని భారత్‌లోకి తీసుకువస్తోంది. డిసెంబర్ 19నత కియా ‘‘సిరోస్’’ ఆవిష్కరించబోతోతంది. కియా సెల్టోస్, కియా సోనెట్ తర్వాత ఇది కియా మూడో ఎస్‌యూవీ కార్. భారతదేశంలో కియా సిరోస్ లాంచ్ 2025 ప్రారంభంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. సైరోస్ కియా ఎలక్ట్రిక్ కార్ ఈవీ9, కార్నివాల్ నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు తెలుస్తోంది. ఇది యూనిక్ ప్రొగ్రెసివ్ ఎస్‌యూవీ డిజైన్ కలిగి ఉంటుంది.
Read Also: Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!
ఫీచర్ల విషయానికి వస్తే వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, L-షేప్ LED టెయిల్‌లైట్‌లు, బాక్సీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయాన్ని పరిశీలిస్తే పరోరమిక్, సన్‌రూఫ్, రెండు-స్పోక్ ఫ్లాట్-బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్ వంటి ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. వెంటిలేడెట్ సీట్లు, అడాస్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
సిరోస్ రెండు ఇంజన్లతో వస్తుందని అంచనా. 1.0 లీటర్ టర్బో డిజిల్ (120PS/172Nm),1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (116PS/250Nm) ఇంజన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఉంటాయి.
కియా సిరోస్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ సెగ్మెంట్‌లో చాలా పోటీ నెలకొని ఉంది. మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO వంటి ఇతర మోడళ్లతో సిరోస్ పోటీ పడనుంది. సోర్సెస్ ప్రకారం, సిరోస్ ధర సోనెట్, సెల్టోస్ మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సోనెట్ సోనెట్ ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 15.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, సెల్టోస్ ధర రూ. 10.90 లక్షల నుండి రూ. 20.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.