PM Modi: ‘హిందూ మతాన్ని అవమానిస్తోంది’.. రాహుల్ గాంధీ “శక్తి” వ్యాఖ్యలపై పీఎం మోడీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు. ‘‘ ఇండియా కూటమి నేతలు హిందూ మతాన్ని పదేపదే ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. ముఖ్యంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా వారు చేసే ప్రతీ ప్రకటన చాలా చక్కగా ఆలోచించబడింది. డీఎంకే, కాంగ్రెస్ ఇండి కూటమి మరే ఇతర మతాలను విమర్శించదు. హిందూ మతం విషయానికి వస్తే, అవమానించడానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు’’ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Arunachal Pradesh: అరుణాచల్ మా దేశంలో విడదీయలేని భాగం.. చైనా వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో ‘‘శక్తి’’ని నాశనం చేయాలని, శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రకటించారు. ఇది హిందూ మతాన్ని, హిందూ విశ్వాసాలను పూర్తిగా అవమానించేలా ఉందని ప్రధాని ఫైర్ అయ్యారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డీఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని అన్నారు. ఇండి కూటమి మహిళల విషయంలో ఎలాగ ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పట్ల ఇండియా కూటమి వ్యవహరించే శైలికి మీ అందరూ సాక్ష్యమని, రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డీఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరీ తెలుసని, ఇది డీఎంకే అసలు రూపమని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి రెండు వైపులని ప్రధాని ఆరోపించారు.
డీఎంకే, కాంగ్రెస్ అంటే అవినీతి, కుటుంబ పాలన అని, కాంగ్రెస్‌ని వదిలించుకున్నాక దేశం 5జీ టెక్నాలజీకి చేరుకుంది, కానీ తమిళనాడులో డీఎంకే సొంతగా 5జీ-వన్ను నడుపుతోందని, వారి కుటుంబ ఐదో తరం తమిళనాడుపై నియంత్రణ కలిగి ఉందని విమర్శించారు. భారతదేశం ఏర్పాటు చేస్తు్న్న డిఫెన్స్ కారిడార్లలో ఒకటి తమిళనాడులోనే ఉందని, బీజేపీ తమిళనాడు డెవలప్మెంట్కి ఏ అవకాశాన్ని వదలడం లేదని, తమిళనాడు మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఉచిత రేషన్ నుంచి ముద్రా యోజన దాకా హామీలను అందించామన ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?