BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’’అని ఆయన అన్నారు. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని అప్పటి ఎంవీఏ ప్రభుత్వమే అదానీ గ్రూప్ ధారవి ప్రాజెక్టుపై సంతకం చేసిందని ఆయన పోస్టులో పేర్కొన్నారు.
‘‘ధారావి సమస్య అస్సలు లేదు. ఈ సమస్యల్నీ గౌతమ్ అదానీపై దాడి’’ అని ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవార్ చేసిన వ్యాఖ్యల్ని మాల్వియా ట్వీట్ చేశారు. ‘‘ అదానీ ధారవి ప్రాజెక్టుపై ఆసక్తి చూపించలేదు. ధారావి ప్రాజెక్టును మరికొందరికి ఇచ్చారు. వారు ఇక్కడికి వచ్చి చర్చించారు. అయితే, ఈ చర్చలు అదానీతో జరగలేదు.’’ అని శరద్ పవార్ అన్నారు.
Read Also: Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!
‘‘అదానీపై రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేలు చేసిన విమర్శల్ని శరద్ పవార్ కొట్టి పారేశారు. ధారావి ప్రాజెక్టుపై అదానీకి ఆసక్తి లేదు. ఈ వ్యాఖ్యలు కీలకమైన పోలింగ్‌కి ముందు ఎంవీఏ కూటమిలో సీనియర్ నేత నుంచి రావడం ఆ కూటమికి ఇబ్బందిగా మారింది’’ అమిత్ మాల్వియా తన పోస్టులో పేర్కొన్నారు.
ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ – మహారాష్ట్ర ప్రభుత్వం మరియు అదానీ గ్రూప్‌ల మధ్య జాయింట్ వెంచర్, ఇది ఆసియాలో అతిపెద్ద మురికివాడకు రూపాన్ని మార్చేందుకు తీసుకువచ్చిన ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాజకీయ అంశంగా మారింది.