PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ డీప్‌ఫేక్ టెక్నాలజీ, ఏఐ ద్వారా వచ్చే ప్రమాదాలను గురించి మంగళవారం హెచ్చరించారు. ఏఐ భారతదేశ టెక్నాలజీని విప్లవాత్మకంగా మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని ప్రధని అన్నారు. అయితే ముఖ్యంగా ఉగ్రవాదుల చేతికి ఏఐ చిక్కొద్దని హెచ్చరించారు.
ఏఐతో అనేక సానుకూలతలు ఉన్నప్పటికీ.. ప్రతికూల ప్రభావాలను కూడా కలిగి ఉందని, ఇది ఆందోళనకలిగించే విషయమన్నారు. 21 శతాబ్ధంలో మానవుడి అభివృద్ధికి ఏఐ సహకరిస్తుందని వెల్లడించారు. అదే సమయంలో దీని వల్ల సమస్యలు కూడా వస్తాయని, ఉదాహరణగా డీప్‌ఫేక్ ప్రపంచానికి సవాలుగా ఉందని తెలిపారు. టెర్రరిస్టుల చేతిలో ఏఐ సాధానాలు ముప్పును పెంచుతాయని, ఉగ్రవాదులు ఏఐ ఆయుధాలు లభిస్తే ప్రపంచ భద్రతపై భారీ ప్రభావం పడుతుదని, దీనిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయాలని సూచించారు.
Read Also: Infosys: వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి రావాల్సిందే.. తప్పనిసరి చేయనున్న ఇన్ఫోసిస్..
ఏఐ సాయంతో ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని తెలిపారు. అదే సమయంలో ప్రపంచాన్ని నాశనం చేసే సామర్థ్యం కూడా ఏఐకి ఉందని హెచ్చరించారు. ఏఐ భద్రత కోసం ప్రపంచదేశాలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గత నెలలో ప్రధాని మాట్లాడుతూ..ఏఐకి సురక్షితంగా ఉండేందుకు సమాజంలోని అన్ని వర్గాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీ-20 దేశాలు ఇందుకోసం కలిసి పనిచేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఇటీవల డీప్‌ఫేక్ వీడియోలు, చిత్రాలు ఏఐపై అనుమానాలను పెంచాయి. ముఖ్యంగా నటీనటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, ప్రియాంకా చోప్రాలకు సంబంధించిన డీప్‌ఫేక్‌లు సంచలన రేపాయి. ముఖ్యంగా రష్మిక మార్ఫింగ్ వీడియోపై సెలబ్రెటీలు స్పందించారు. దీనిపై కేంద్రం చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మరోవైపు డీప్‌ఫేక్ వివాదంపై ప్రధాని మోడీ తన ఆందోళనను వ్యక్తం చేశారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi at Global Partnership on Artificial Intelligence Summit says, "AI has several positive impacts, but it has many negative impacts too which is a matter of concern. AI can become the biggest tool in the development of the 21st century.… pic.twitter.com/Wt8Gn0CEVV
— ANI (@ANI) December 12, 2023