Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ డుమ్మా కొట్టింది. దేశంలోని నియంత్రణ సంస్థల పని తీరును సమీక్షించేందుకు సెబీ చైర్ పర్సన్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) నోటీసులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఆమె కమిటీ ముందు హాజరు కావాల్సి ఉండగా.. కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల తాను రాలేక పోతున్నాను అని పీఏసీ కమిటీకి తెలిపింది. దీంతో రివ్యూ సమావేశాన్ని కమిటీ వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఇక, సెబీ చీఫ్ గైర్హాజరుపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు.
Read Also: Akhilesh Yadav: యూపీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ..
ఇక, మొదటి కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ పని తీరుపై సమీక్షించాలని తాము భావించామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మీటింగ్ కోసం సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశాం.. ఈ సందర్భంగానే మాధబి మీటింగ్ నుంచి మినహాయింపు కోరారు.. కానీ మేం దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు.. ఆ తర్వాత తాను, తన బృందంతో కలిసి మీటింగ్‌కు హాజరవుతామని చెప్పుకొచ్చారు. ఇక, కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఆమె ఢిల్లీకి వచ్చే పరిస్థితి లేదని ఈరోజు (గురువారం) ఉదయం 9:30గంటలకు మాకు సమాచారం వచ్చింది.. దీంతో ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని సమావేశాన్ని మరోసారి వాయిదా వేశామని వెల్లడించారు. మాధబి బచ్‌కు పీఏసీ కమిటీ సమన్లు పంపండం ఇది సెకండ్ టైం.