USA Based Companies : 24 గంటల్లోనే రెండు పెద్ద అమెరికన్ కంపెనీలు భారతదేశం ముందు తలవంచాయి. ఈ రెండు కంపెనీలు తమ తమ రంగాలలో దిగ్గజాలు. ఒకటి మార్క్ జుకర్‌బర్గ్ మెటా..
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ డుమ్మా కొట్టింది. దేశంలోని నియంత్రణ సంస్థల పని తీరును సమీక్షించేందుకు సెబీ చైర్ పర్సన్ కు పార్లమెంటరీ కమిటీ (PAC) నోటీసులు జారీ చేసింది.
Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్‌పర్సర్ మధాబీ పూరి భుచ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు.
Rajeev Chandrasekhar: సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా నివేదికను రాజకీయ నాయకులు, ఆర్థిక నిపుణులు తోసిపుచ్చారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
అదానీ కేసులో సెబీ చీఫ్‌పై అమెరికా షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్‌లలో సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది.
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది...ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది.
Adani Current Networth: వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక నుండి భారతదేశపు అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ పూర్తిగా కోలుకుంటున్నారు. ఈ దిశలో బుధవారం ఒక ముఖ్యమైన మైలురాయి వచ్చింది.
అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ భారత బిలీనియర్ గౌతం అదానీ నేతృత్వంలోని కంపెనీలపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అంతేకాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించాయి. హిండెన్‌బర్గ్ సంస్థ ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అదానీ కంపెనీలపై విచారణ చేపట్టింది. ఈ…
Mallikarjun Kharge: ‘జాతీయ వ్యతిరేక టూల్ కిట్’లో రాహుల్ గాంధీది శాశ్వత భాగస్వామ్యం అంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే విరుచుకుపడ్డారు. బీజేపీనే దేశ వ్యతిరేకుల పార్టీ అని, వారు భారతస్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని దుయ్యబట్టారు. ఇంత చేసినవారు ఇతరులను దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
Supreme Court : అదానీ గ్రూప్ - హిండెన్‌బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి ఉత్పన్నమయ్యే సమస్యపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.