బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(54) ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. ఇంట్లో దొంగ చేతిలో నటుడు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజుల చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో దొంగను పట్టుకునే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మంగవారం మధ్యాహ్నం ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ తల్లి, భార్య కరీనా కపూర్, కుమార్తె సారా అలీ ఖాన్ సాయంతో ఇంటికి చేరారు. అయితే ఒక వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు సందర్శకులను అనుమతించొద్దని వెల్లడించారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి పోలీస్ అధికారుల బృందం వచ్చే అవకాశం ఉంది. సైఫ్ అలీ ఖాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే ఛాన్సుంది.
ఇది కూడా చదవండి: ONGC Recruitment 2025: ఓఎన్‌జీసీలో జాబ్స్.. నెలకు రూ.1.8 లక్షల జీతం.. అస్సలు వదలొద్దు!
జనవరి 16న ఓ దుండగుడు అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో సిబ్బంది అలర్ట్‌తో అరవడంతో సైఫ్ అలీ ఖాన్ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దొంగ కత్తితో పొడవడంతో సైఫ్ అలీ ఖాన్‌కు ఆరు కత్తిపోట్లు అయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సైఫ్‌కు 5 గంటల పాటు ఆపరేషన్ చేశారు. రెండు గాయాలు లోతుగా ఉన్నట్లు గుర్తించారు. ఒక కత్తి ముక్కను కూడా బయటకు తీశారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబైలో భద్రత లేదంటూ విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. ఒక్క ఘటనతో భద్రతపై విమర్శలు చేయడం సరికాదని.. దేశంలోనే ముంబై సేఫ్ ప్లేస్ అంటూ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ..