Ramdev Baba: యోగా గురు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రామ్ దేవ్ బాబా వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఏదో ఒక వర్గానికి చెందిన వారిపై ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తప్పా ఒప్పా అన్నది ఆలోచించుకోవాలని అన్నారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముస్లింలందరూ ఉగ్రవాదులు, రేపిస్టులు అని నోరు జారారు రాందేవ్ బాబా. ఫిబ్రవరి 3న బర్మర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ స్పందిస్తూ.. అవి తప్పా ఒప్పా అన్నది ఎవరికి వారే ఆలోచించాలని స్పష్టం చేశారు.
Read also: Bandi Sanjay: గిరిజన రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా..
అంతకు ముందు కూడా బాబా రాందేవ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళలు దుస్తులు ధరించకపోయినా అందంగా ఉంటారన్న రామ్‌దేవ్ వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలీ చకంకర్, బాబా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ క్షమాపణ లేఖ కూడా పోస్ట్ చేశారు. స్త్రీలు చీరలో అందంగా కనిపిస్తారు. వారు సల్వార్‌లోనూ అందంగా కనిపిస్తారు. నా కళ్లకు… ఏం వేసుకోకపోయినా అందంగానే కనిపిస్తారు అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వేదికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలకు షాక్ తిన్న ఆమె అసహనాన్ని ప్రదర్శించకుండా నవ్వుతూనే ఉంది.
Bandi Sanjay: కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారు