సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.. దానిలో భాగంగానే మోడీ-పవార్ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.. ఇక, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా శరద్ పవార్‌తో నిన్ననే సంప్రదింపులు జరిపారు. అయితే, మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితు దృష్ట్యా మోడీ-పవార్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి పెరిగింది..
మహా వికాస్ అగాఢీలో పేరుతో శివసేన, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. శివసేన తిరిగి బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని.. గతంలో మహారాష్ట్ర సీఎం.. ప్రధానిని కలిసినప్పుడు ప్రచారం జరిగింది.. దీనిపై మిత్రుల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే గుసగుసలు కూడా వినిపించాయి. మరోవైపు ఈ మధ్యే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో రెండు దఫాలుగా చర్చలు జరిపారు శరద్ పవార్.. ఆ తర్వాతే ఢిల్లీ వేదికగా నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ నేతలతో అఖిలపక్ష భేటీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.