Rahul Gandhi: మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- శివాజీని అవమానించారని వ్యాఖ్య
- మహారాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠా దిగ్గజానికి అవమానకరమని అన్నారు. ఆగస్టు 26న కుప్పకూలిన ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించారు. గురువారం మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రాహుల్ ప్రసంగిస్తూ.. విగ్రహం నిర్మించిన కొద్ది నెలలకే కూలిపోయిందని దుయ్యబట్టారు. ఇది శివాజీ మహారాజ్‌ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. శివాజీ మహారాజ్ విగ్రహం కూలినందుకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారని, తప్పు చేసిన వ్యక్తి క్షమాపణలు చెప్పాలన్నారు. తప్పు చేసేవాడు క్షమాపణలు చెబుతాడు.. మీరు ఏ తప్పు చేయకుంటే ఎందుకు క్షమాపణలు చెబుతారు? అని ప్రధాని మోడీని రాహుల్ నిలదీశారు.
ఇది కూడా చదవండి: Sikkim: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ఆర్మీ వాహనం, నలుగురు సైనికులు మృతి
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
‘‘మోడీ ఎందుకు క్షమాపణలు చెప్పారో అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. మొదట మోడీ విగ్రహాన్ని నిర్మించే కాంట్రాక్ట్‌ను ఆర్‌ఎస్ఎస్ క్యాడర్‌కు ఇచ్చారు. బహుశా అతను అలా చేయకూడదని అతను భావించి ఉండవచ్చు. ఆ కాంట్రాక్టర్ మోసం చేసి మహారాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడని ప్రధాని భావించి ఉండవచ్చు.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శివాజీ మహారాజ్‌కి మాత్రమే కాకుండా మహారాష్ట్ర ప్రజలకు కూడా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Himachal Pradesh: హిమాచల్ రాజకీయాల్లో ‘మసీదు’ వివాదం.. లవ్‌జీహాద్‌పై కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..
ఆగస్ట్ 30న పాల్ఘర్‌లో చేసిన ప్రసంగంలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పాటు ఆయన అనుచరులు మరియు ఆయనను దేవతగా గౌరవించే వారందరికీ క్షమాపణలు చెప్పారు. ఇక బుధవారం మహారాష్ట్ర పోలీసులు థానే జిల్లాలోని కళ్యాణ్‌లో విగ్రహం కూలిన ఘటనకు సంబంధించి శిల్పి-కాంట్రాక్టర్ జయదీప్ ఆప్టేను అరెస్టు చేశారు. 24 ఏళ్ల శిల్పి విగ్రహం కూలిన తర్వాత 10 రోజుల పాటు జాడ తెలియకుండా పోయింది.
#WATCH | Sangli | On Chhatrapati Shivaji Maharaj statue collapse, Congress MP & LoP Lok Sabha, Rahul Gandhi says, "…I give you a guarantee that Kadam ji's (late Congress minister Patangrao Kadam) statue installed will be here even after 50-70 years….Shivaji Maharaj's statue… pic.twitter.com/58HRkT3CEF
— ANI (@ANI) September 5, 2024
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!