Udaipur tailor Murder: 2022లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిని ఉదయ్‌పూర్ దర్జీ హత్య కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. టైలర్ కన్హయ్యలాల్‌ని దారుణంగా హత్య చేసిన నిందితుల్లో ఒకరైన మహ్మద్ జావేద్‌కి రాజస్థాన్ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) జూలై 22, 2022న ఉదయ్‌పూర్‌లో జావేద్‌ని అరెస్ట్ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లత్ కీలక విషయాల్ని వెల్లడించారు. హంతకులకు అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలున్నాయని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఆ టైలర్ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులై వెల్లడైందని ఆయన తెలిపారు. ‘‘ఈ హత్యోదంతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ హత్య జరిగినట్లు వాళ్లు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులకు ఇతర దేశాల్లోనూ కాంటాక్ట్స్ ఉన్నట్టు తేలింది’’ అని సీఎం అన్నారు. అంతేకాదు..…