RSS leader: రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘సోషలిస్ట్’’, ‘‘సెక్యులర్’’ పదాలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గురువారం డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితిని విధించినందుకు కాంగ్రెస్‌ని విమర్శించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు.
RSS: ఔరంగజేబు సమాధి వివాదం నడుస్తు్న్న వేళ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ.. ‘‘ భారతదేశ నైతికతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఆరాధిస్తున్నామా..? ఆక్రమణదారుల మనస్తత్వం ఉన్నవారు భారతదేశానికి ముప్పు’’ అని అన్నారు.
RSS: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల పదేపదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై ఆర్ఎస్ఎస్ స్పందించింది. రాహుల్ గాంధీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ఆర్ఎస్ఎస్ వాస్తవికతను చూడాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేమ హోసబాలే అన్నారు. స్వలింగ వివాహాలపై కేంద్రం దృష్టితో తాము ఏకీభవిస్తున్నామని, ఆడ, మగ వారి మధ్యే వివాహం జరుగుతుందని హోసబాలే అన్నారు.