Medha Gandhi: నేడు మహాత్మా గాంధీ పుట్టిన రోజు. భారతజాతి ముద్దుగా బాపు అని పిలుచుకునే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సాంప్రదాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి అసత్యమాడటం గాంధీకి గిట్టని పనిగా చెబుతుంటారు. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా పోర్‌బందర్‌లోను, రాజ్‌కోట్‌లోనూ కొనసాగింది. గాంధీజీకి 13 ఏళ్ల వయస్సులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరిబాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. అయితే.. బాపు కుటుంబంలోని ఐదవ తరానికి చెందిన మేధా గాంధీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
మేధా మహాత్మా గాంధీ పెద్ద కుమారుడు హరిలాల్ గాంధీ వారసురాలు. హరిలాల్ కుమారుడు కాంతిలాల్ గాంధీ. అతను స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. దండి మార్చ్ సమయంలో మహాత్మా గాంధీతో కలిసి నడిచాడు. కాంతిలాల్ కుటుంబం చాలా సంవత్సరాల క్రితం అమెరికాకు మకాం మార్చింది. అక్కడ మేధా గాంధీ పుట్టి పెరిగింది. అయితే, ఆమె జీవితం బాపు సరళతకు పూర్తిగా భిన్నమైన మార్గాన్ని తీసుకుంటుంది. మేధా గాంధీ అమెరికాలో బహుముఖ ప్రజ్ఞాశాలి కళాకారిణి. ఆమె వృత్తిరీత్యా హాస్య రచయిత్రి, నిర్మాత, గాయని. ఆమె అమెరికాలో “డేవ్ అండ్ ది షో”, “మాటీ ఇన్ ది మార్నింగ్ షో” వంటి అనేక ప్రసిద్ధ రేడియో, టెలివిజన్ కార్యక్రమాలను నిర్మించింది. ఆమె యునైటెడ్ స్టేట్స్‌లో ప్రసిద్ధి చెందిన “ఎల్విష్ డ్యూరాన్ అండ్ ది మార్నింగ్ షో” హోస్ట్ గా వ్యవహరించింది. మేధా సోషల్ మీడియాలో యక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 250,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. తరచుగా ఆమె జీవితంలోని ప్రత్యేక క్షణాలను పంచుకుంటారు. ఆమె ఫ్యాషన్, జీవనశైలి పూర్తిగా పాశ్చాత్య సంస్కృతిచే ప్రభావితమయ్యాయి. బాపు సరళమైన జీవితాన్ని ఎంచుకున్నప్పటికీ, ముని మనవరాలు గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.