Priyanka Gandhi: ప్రియాంక అరంగేట్రం అదిరింది.. లోక్‌సభలో అడుగుపెట్టేదెప్పుడంటే..!
- ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరింది
- వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికలో భారీ విజయం
- 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక గెలుపు
- సోమవారమే లోక్‌సభలోకి అడుగుపెట్టే ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్‌గాంధీ సోదరి, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ రాజకీయ అరంగేట్రం అదిరిపోయింది. తొలి ప్రయత్నంలోనే సూపర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేయకముందు.. కాంగ్రెస్ పక్షాన ప్రచారం మాత్రమే నిర్వహిస్తూ ఉండేవారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తూ ఉండేవారు. అన్ని వెనుకుండే నడిపించేవారు. అలాంటిది తొలిసారి వయనాడ్ లోక్‌సభ బైపోల్స్ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు. అంతే కనీవినీ ఎరుగని రీతిలో భారీ విక్టరీ అందుకున్నారు. తన సోదరుడు రాహుల్‌గాంధీ మీద ఉన్న 3.64 లక్షల మెజార్టీని దాటుకుంటూ 4 లక్షల మెజార్టీని క్రాస్ చేసి అత్యధిక విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 4,08,036 ఓట్ల మెజార్టీతో ప్రియాంక విక్టరీ సాధించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: మహాయుతీ కూటమి చారిత్రాత్మక విజయానికి శుభాకాంక్షలు.. సీఎం ట్వీట్
Also Read
- Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ఇదిలా ఉంటే నవంబర్ 25 (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో సోమవారమే ప్రియాంక లోక్‌సభలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సోదరుడితో కలిసి లోక్‌సభలోకి ప్రవేశించి.. ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇక గాంధీ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో ఉండడం విశేషం. తల్లి సోనియాగాంధీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రాహుల్‌గాంధీ.. కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెడుతున్నారు. మొత్తానికి తల్లి సోనియాతో పాటు ఇద్దరు పిల్లలు లోక్‌సభలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: BMW Price Hike: కార్ల ధరలను పెంచుతున్న బీఎండబ్ల్యూ.. ఎప్పటినుంచో తెలుసా?
లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్‌బరేలీలో కొనసాగుతున్నారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకున్నప్పుడే.. ఆ స్థానంలో ప్రియాంక పోటీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె బరిలోకి దిగి తొలి అరంగేట్రంలో భారీ విక్టరీని అందుకున్నారు.
తాజావార్తలు
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?