Prime Minister Narendra Modi will visit temples: ప్రతీ దీపావళికి ప్రధాని నరేంద్ర మోదీ సాయుధబలగాలతో గడుపుతుంటారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా దేవాలయాల బాట పడుతున్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 24న దీపావళికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 21 కేదార్ నాథ్, బద్రీనాథ్ దేవాలయాలను సందర్శించనున్నారు. ఆ తరువాత అక్టోబర్ 23న ఛోటీ దీపావళి రోజు ఆయోధ్యలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేవాలయాలను సందర్శిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగా.. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అక్టోబర్ 21న తెల్లవారుజామున ప్రధాని ఢిల్లీ నుంచి కేదార్ నాథ్ బయలుదేరనున్నారు. అక్కడ దర్శనం అనంతంర రోప్ వేకు శంకుస్థాపన చేయనున్నారు. బద్రీనాథ్ వెళ్లే ముందు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన పరిశీలించనున్నారు. దేవాలయాల్లో దర్శనం అనంతరం ఆలయాల అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
Read Also: 5G India Rollout: త్వరలోనే ఈ నగరాల్లో 5 జీ సేవలు.. వచ్చే మార్చి నాటికి 200 నగరాలు టార్గెట్
అక్టోబర్ 23న అయోధ్యలోని రామమందిర నిర్మాణాలను పరిశీలించనున్నారు. అక్కడే ప్రార్థనలు చేయనున్నారు. సరయూ నది ఒడ్డున సాయంత్ర జరిగే ఆరతి, దీపోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. రామ్ కీ పైరీపై దీపాలను వెలిగించనున్నారు.
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ఇటీవల విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్ 12 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది. 1985 నుంచి ఏ పార్టీ కూడా హిమాచల్ ప్రదేశ్ లో వరసగా రెండుసార్లు విజయం సాధించలేదు. అయితే ఈ సారి మాత్రం బీజేపీ రికార్డు క్రియేట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే గుజరాత్ ఎన్నికలు కూడా రానున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు ప్రజల మూడ్ తెలియజేస్తాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.