కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన…
సుఖ్వీందర్ సింగ్‌ది మొదట్లో సాధారణ జీవనమే. ఆయన తండ్రి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా పనిచేశారు. సుఖు కూడా ఒకప్పుడు పాలు విక్రయించారు. పాలు విక్రయించిన సుఖ్వీందర్.. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నారు. బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిమాచల్‌లో 68 సీట్లలో 40 గెలిచిన కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై కసరత్తు చేస్తోంది. శాసనసభ పక్షనేత ఎన్నిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
గురువారం ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ధనిరామ్ షాండిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి, అల్లుడు రాజేష్ కశ్యప్‌ను ఓడించారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరగనుంది.
గుజరాత్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 182 స్థానాల్లో 156 స్థానాలను కైవసం చేసుకుంది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గుజరాత్ లోని మొత్తం 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్ పార్టీల్లో ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.
Congress camp politics in Himachal Pradesh elections: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పరుగులు పెడుతోంది. 150 సీట్ల కన్నా ఎక్కువ స్థానాలు సాధించి ఏడో సారి అధికారంలోకి రానుంది. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మాత్రం ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో…
హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీలకు అతీతంగా నాయకుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించే రోజు వచ్చేసింది. నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా హిమాచల్ ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్ రికార్డు నెలకొల్పింది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తాషిగ్యాంగ్ ఉంది.