PM Modi-Trump: ట్రంప్‌తో మోడీ భేటీపై భారత విదేశాంగ శాఖ ఏం చెప్పిందంటే..!
- ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
- ట్రంప్‌తో పాటు మస్క్.. వ్యాపార వేత్తలతో భేటీకానున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఈనెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ తెలిపారు. ముందుగా ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈనెల 11న ఫ్రాన్స్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోడీ అధ్యక్షత వహించనున్నారు. 12న పారిస్‌లో జరిగే వీవీఐపీ విందులో మోడీ పాల్గొని.. అమెరికా వెళ్లనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకానున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. చర్చలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు మోడీ అమెరికాలో పర్యటిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Steve Smith: స్మిత్ సెంచరీల పరంపర.. ద్రవిడ్, జోరూట్ రికార్డులు సమం
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేశాక.. అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరు కానున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తారని, ప్రవాసులతో సంభాషిస్తారని వెల్లడించారు. అంతేకాకుండా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో పాటు అమెరికా సీనియర్ అధికారులతో కూడా భేటీ కానున్నారు.
ఇది కూడా చదవండి: Ration Rice Benefits: రేషన్ బియ్యం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
ట్రంప్ మొదటి పదవీ కాలంలో ప్రధాని మోడీ రెండు సార్లు అమెరికాను సందర్శించారు. రెండో సారి ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. అమెరికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక ట్రంప్‌ను అభినందించిన ప్రపంచ నాయకుల్లో మోడీ ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కొద్దిరోజులకే మోడీకి ఆహ్వానం రావడం కూడా ఇరుదేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అర్థమవుతోంది.
#WATCH | Delhi: On PM Modi's visit to the US, Foreign Secretary Vikram Misri says, "At the invitation of US President Donald Trump, PM Modi will pay an official working visit to the US on 12th and 13th of February. This will be the first visit of Prime Minister Modi to the United… pic.twitter.com/nlQzciMh0Z
— ANI (@ANI) February 7, 2025
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!