Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarakaya Vepudu: సాధారణంగా కాకరకాయ అంటే చేదు అని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ కొద్దిగా భిన్నంగా, ప్రత్యేకమైన మసాలా పొడితో కాకరకాయ కారాన్ని చేసుకుంటే అస్సలు చేదు అనిపించదు సరికదా.. పళ్ళ కింద కరకరలాడుతూ మంచి రుచినిస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉండే ఈ కాకరకాయ వేపుడు తయారీ విధానం, కావలసిన పదార్థాలు, నిల్వ చేసుకునే పద్ధతిని ఇప్పుడు వివరంగా చూద్దాం..
కావలసిన పదార్థాలు
* కాకరకాయలు: అర కిలో (1/2 kg)
* నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
* పల్లీలు (వేరుశనగ గింజలు): అర కప్పు
* కరివేపాకు: ఒక గుప్పెడు
* ధనియాలు: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1/2 టీస్పూన్
* నువ్వులు: 1/4 కప్పు
* ఎండు కొబ్బరి ముక్కలు: అర కప్పు కంటే కొద్దిగా తక్కువ
* కారం పొడి: 3 టీస్పూన్లు (రుచికి సరిపడా)
* పసుపు: 1/2 టీస్పూన్
* చింతపండు: కొద్దిగా
* వెల్లుల్లి రెమ్మలు: 10
* ఉప్పు: రుచికి తగినంత
Also Read
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
- Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
- Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
తయారీ విధానం
కాకరకాయల ప్రాసెసింగ్ & కటింగ్
ముందుగా అర కిలో కాకరకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కాకరకాయల పైభాగంలో ఉండే గరుకు బుడుపులను లైట్ గా గీరి తొలగించాలి. ఆ తర్వాత వాటిని చక్రాల మాదిరిగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ లావుగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. లోపల ఉండే గింజలు కావాలనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు. గింజలతో వేయించుకుంటేనే వేపుడు మరింత రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది.
ముక్కలు, పల్లీల డీప్ ఫ్రై
స్టవ్ వెలిగించి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను మీడియం మంటపై రెండు దఫాలుగా వేయించుకోవాలి. ముక్కలు మంచి ఎరుపు రంగులోకి మారి క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించి, ఆయిల్ నుండి తీసి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో అర కప్పు పల్లీలను దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. చివరగా గుప్పెడు కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించి పక్కకు తీసుకోవాలి.
మసాలా పొడి తయారీ
మరొక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. అవి వేగాక పావు కప్పు తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మిక్సీ జార్లో మొదటగా వేయించిన పల్లీలను వేసి జస్ట్ ఒక్క పల్స్ ఇచ్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా ఉన్న పల్లీల పొడిని వేయించిన కాకరకాయ ముక్కలలో కలపాలి.
ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించిన ధనియాలు-జీలకర్ర-నువ్వుల మిశ్రమం, ఎండు కొబ్బరి ముక్కలు, 3 టీస్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి. చివరగా 10-15 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మూడు నాలుగు సార్లు పల్స్ ఇచ్చి లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
సర్వింగ్
ఇలా సిద్ధం చేసుకున్న తాజా కారప్పొడిని, వేయించి ఉంచుకున్న కరివేపాకును కాకరకాయ ముక్కలు ఉన్న బౌల్లో వేయాలి. చేత్తో కొద్దిగా ఒత్తుతూ ముక్కలన్నింటికీ మసాలా, కారం బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి. అంతే… ఎంతో సువాసనభరితమైన, కరకరలాడే కాకరకాయ కారం రెడీ. ఈ విధంగా తయారుచేసుకున్న కాకరకాయ వేపుడును పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా శుభ్రమైన, గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు ఎంతో తాజాగా, క్రిస్పీగా నిల్వ ఉంటుంది. అన్నంలోకి, సాంబార్ లేదా పప్పుచారుకు సైడ్ డిష్‌గా ఇది అద్భుతమైన కాంబినేషన్.
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!