Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indraja Comments About Success Meets: తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా ప్రమోషన్లు, ముఖ్యంగా ‘సక్సెస్ మీట్’ల సంస్కృతిపై ఆమె తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. సినిమా ప్రచారంలో భాగం కావడం నటీనటుల బాధ్యతే అయినప్పటికీ.. సినిమా ఫలితం విషయంలో మాత్రం నిజాయితీగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’ థాంక్స్ మీట్లో పాల్గొన్న ఇంద్రజ పై వ్యాఖ్యలు చేశారు.
‘ఒక సినిమాలో భాగమైన తర్వాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం నటీనటుల బాధ్యత. నేను చిన్న క్యారెక్టర్ చేసినా ప్రమోషన్ చేస్తా. నేను సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతా. ఒక సినిమా కోసం నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో కష్టపడతారు. ఆ కష్టాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రమోషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం నా నైతిక బాధ్యతగా భావిస్తా. అయితే సక్సెస్ మీట్ల విషయంలో మాత్రం నాకు కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి. సినిమా నిజంగా విజయం సాధించినప్పుడే నేను సక్సెస్ మీట్‌కు హాజరవుతా’ అని ఇంద్రజ స్పష్టం చేశారు.
Also Read
కేవలం పబ్లిసిటీ కోసం, సినిమా సరిగ్గా ఆడకపోయినా సక్సెస్ మీట్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం తాను రాను అని ఇంద్రజ చెప్పారు. ‘సినిమా జెన్యూన్‌గా సక్సెస్ సాధిస్తేనే నేను సక్సెస్ మీట్లో కనిపిస్తాను. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోయినా, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా.. ఏదో పేరుకి సక్సెస్ మీట్ అని పెడితే మాత్రం నేను హాజరు కాను’ అని ఇంద్రజ కుండ బద్దలు కొట్టారు. సినిమా ఫలితాన్ని అంగీకరించడంలో నిజాయితీ ఉండాలని, ప్రేక్షకుల తీర్పును గౌరవించాలని పేర్కొన్నారు. కేవలం ప్రచారం కోసం సినిమా విజయాన్ని అతిగా చూపించడం తనకు నచ్చదనే విషయాన్ని ఇంద్రజ స్పష్టం చేశారు. అనకాపల్లి పెద్ద సక్సెస్ అయిందని ఇంద్రజ చెప్పకనే చెప్పారు.
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!