RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- రేపు ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న ఆర్బీఐ
- ద్రవ్యోల్బణం కట్టడిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్
- 2023 తర్వాత ఆర్బీఐ షాక్ ఇచ్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తం అయింది. ద్రవ్యోల్బణం కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వరుసగా 21 ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాల్లో వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించిన ఆర్బీఐ.. అక్టోబర్ 7న (బుధవారం) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.5 శాతానికి తీసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే.. 2023 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా ఆర్బీఐ రెపో రేటును పెంచినట్లవుతుంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావడం, రూపాయి విలువపై ఒత్తిడి వంటి అంశాలు ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐకి సవాళ్లుగా మారాయి.
రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే చాలావరకు అంచనా వేస్తున్నాయి. దీంతో అసలు ఆసక్తి వడ్డీ రేటు పెంపు ఎంత అన్నదానికంటే.. రాబోయే రోజుల్లో ఆర్బీఐ అనుసరించే విధానం, ద్రవ్యోల్బణం-వృద్ధిపై దాని అంచనాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నగదు నిర్వహణ ఎలా ఉంటాయన్నదానిపైనే ఉంది. ఆర్బీఐ వైఖరి ప్రస్తుతం ‘న్యూట్రల్’గా ఉన్నప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మరింత కఠినమైన లేదా హాకిష్ వైఖరి అవలంబిస్తుందా? అన్నది మార్కెట్లు గమనిస్తున్నాయి.
Also Read
- SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
- Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
- Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాను ఆర్బీఐ ప్రస్తుతం 5 శాతంగా ఉంచింది. అయితే ముడిచమురు, ఇతర కమోడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంచనాను పెంచుతుందా? లేదా కొనసాగిస్తుందా? అనేది కీలకం. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. జూలైలో ఇది 4.45 శాతంగా ఉంది. దేశీయ పరిస్థితులు క్రమంగా సాధారణీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. 2026-27లో CPI ద్రవ్యోల్బణం 5.2 శాతానికి చేరవచ్చని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముడిచమురు వంటి వస్తువుల ధరల పెరుగుదల సరఫరా ఆధారిత ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందా? అన్నది ఆర్బీఐకి సవాలుగా మారనుంది.
ప్రస్తుతం మార్కెట్ అంచనాల ప్రకారం.. ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపుతో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత ఎన్ని దశల్లో రేట్లు పెంచుతారు? ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనా ఏంటి? వృద్ధి విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? లిక్విడిటీని ఎలా నిర్వహిస్తుంది? అనే అంశాలే మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. మొత్తంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే ఆర్థిక వృద్ధికి పెద్దగా ఇబ్బంది కలగకుండా క్రమబద్ధమైన రేట్ల పెంపు విధానాన్ని ఆర్బీఐ అనుసరించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
- Tags
- india
- RBI
- RBi Repo Rate
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ భవితవ్యం.. రేపు ‘‘పరువు నష్టం’’ కేసులో కోర్టు తీర్పు..
-
Nothing Phone (5) Pro: నథింగ్ Phone (5) Pro, Phone (5) ఫస్ట్ లుక్.. 144Hz డిస్ప్లే, 8K వీడియో, భారీ బ్యాటరీ?
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!