Rahul Gandhi: అదానీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సహా అతడి మేనల్లుడు సాగర్ అదానీ మరికొందరు 2020-2024 మధ్యాలంలో రూ. 2,029 కోట్లు అంచాలు ఇచ్చారని అమెరికా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది.
అయితే, దీనిపై కాంగ్రెస్, దాని అధినేత రాహుల్ గాంధీ అదానీపై మరోసారి ఆరోపణలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి అదానీకి, పీఎం మోడీ రక్షిస్తున్నాడని అతను స్వేచ్ఛగా ఉన్నాడని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే తప్పా ఎలాంటి విచారణ నమ్మదగినది కాదని చెప్పారు. అంతిమంగా బీజేపీ నిధులు నిర్మాణం మొత్తం ఆయన చేతుల్లోనే ఉన్నందున నరేంద్రమోడీ పేరు బయటకు వస్తుందని చెప్పారు.
Read Also: Vivo Y300 5G: మిడ్ రేంజ్లో సొగసైన డిజైన్‌తో ఫోన్ను తీసుకొచ్చిన వివో.. వివరాలు ఇలా
ఈ మీడియా సమావేశంలో ఆరోపణలు చేస్తున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలిగింది. అయితే, ఈ కరెంట్ కోతకు ‘‘అదానీ పవర్, మోడీ పవర్’’ కారణమని రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ సంబిత్ పాత్ర రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ఆపేందుకు అతని సన్నిహితుడు జైరాం రమేష్ కరెంట్ కట్ చేసి ఉండొచ్చు’’ అని సెటైర్ వేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సంబిత్ పాత్ర మాట్లాడుతూ..“రాహుల్ గాంధీ అదే మూడు పదాలను పునరావృతం చేస్తూనే ఉన్నారు-అదానీ, అంబానీ, చోర్. ఈరోజు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరెంటు పోయిందని, దానికి కూడా అదానీని, మోడీని దూషించాడు. ఇది ఆయన కార్యాలయంలో రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న జైరాం రమేష్ ‘రాహుల్ గాంధీ చాలు’ అనుకుని పవర్ కట్ చేసి ఉండొచ్చు’’ అని అన్నారు. రాఫెల్, కోవిడ్ వ్యాక్సిన్‌లు, ఇప్పుడు అదానీ వంటి సమస్యలను గాంధీ ఉపయోగించుకుని పార్లమెంటు సమావేశాలకు ముందు అంతరాయం కలిగించారని పాత్రా ఆరోపించారు. భారత సంస్థలపై దాడి చేయడానికి రాహుల్ గాంధీ సాధారణ వ్యూహం ఇది అని ఆరోపించారు.