PM Modi: వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్‌పై “ఏప్రిల్ ఫూల్” కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ ట్రైన్ ను శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Emergency at Delhi airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ.. పక్షిని ఢీకొట్టిన ఫెడ్ ఎక్స్ విమానం..
Also Read
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
‘‘ ఈ రోజు కాంగ్రెస్ మిత్రులు మోదీ అందరిని ఏప్రిల్ ఫూల్స్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు.. కానీ ఈ రైలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం అయింది. ఇది మన నైపుణ్యం, సామర్థ్యం, విశ్వాసానికి చిహ్నం’’ అని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయని, ప్రజల సంక్షేమం కోసం వారు సమయం కేటాయించలేదని ప్రధాని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఒకే కుటుంబంపై దృష్టి సారించాయిని పరోక్షంగా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. పేద, మధ్య తరగతివారిని ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇందుకు భారత్ రైల్వేలే ఉదాహరణ అని, చాలా కాలం రైల్వేను ఆధునీకీకరించలేదని అన్నారు. వారి స్వప్రయోజనాల కోసమే రైల్వేలను వాడుకున్నారంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!