ప్రధాని మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. రక్షా బంధన్‌కు ముందు దేశ వ్యాప్తంగా రైతులకు బహుమతి అందించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు.
ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఈ సమావేశ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు సాయంత్రం సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వచ్చే నెల (ఆగష్టు)2వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆగస్ట్ 2న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Brinda Streaming in Sony liv from august 2: స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష కృష్ణన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ కూడా వచ్చింది. త్రిష కృష్ణన్ పోలీస్ గా నటించిన “బృందా” వెబ్ సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మూవీ మేకర్స్ తాజాగా వెబ్ సిరీస్ సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ…