PM Modi: యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు..
- యుద్ధం కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవు..
- యుద్ధం ఎఫెక్ట్ దీర్ఘకాలం ఉంటుంది..
- రాజ్యసభలో ప్రధాని మోడీ స్పీచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాజ్యసభలో అన్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు చర్చల మార్గాన్ని అనుసరించాలని భారత్ సూచించింది. ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ప్రధాని హెచ్చరించారు. ముఖ్యంగా ‘‘హార్ముజ్ జలసంధి’’లో ఇరుక్కుపోయిన నౌకలు, అందులోని భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇరాన్ యుద్ధం మూడు వారాలుగా కొనసాగుతోందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఏర్పడిందని మోడీ సభలో చెప్పారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 1 కోటికి మంది భారతీయలు వివిధ పనులు చేస్తున్నారని, వీరి ప్రాణాలకు భారత్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్, గల్ఫ్‌లోని తన మిత్రదేశాలతో పాటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తుందని వెల్లడించారు. యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యం, చర్చలు జరపాలని సూచించినట్లు చెప్పారు. ప్రజలు, మౌలిక సదుపాయాలపై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించినట్లు వెల్లడించారు.
భారత్‌కు తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గత 11 ఏళ్లలో 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వల్ని ఏర్పాటు చేశామని, భారత్ 41 దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు, ఒకే దేశంపై ఆధారపడి లేమని వెల్లడించారు. భారత్ ట్రేడ్ 90 శాతం విదేశీ నౌకలపై ఆధారపడుతోందని దీనిని తగ్గించేందుకు రూ. 70,000 కోట్ల ప్రాజెక్టు ప్రారంభించామని, స్వదేశీ నౌకల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాజ్యసభలో అన్నారు. అవసరమైన వస్తువులు, నిల్వల్ని నిరంతరం పరిశీలించాలని, ఎక్కడైనా అక్రమ నిల్వలు కనిపిస్తే చర్యలు తీసుకోవాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, ఈ ప్రభావాన్ని అంచనా వేసేందుకు మంత్రులతో ఒక టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎల్పీజీ, పీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!