బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ సమావేశమై, కీలక పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల మండలి సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది ముఖ్యమంత్రులు, ఎనిమిది మంది ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు.