PM Modi: మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంక చేరుకున్నారు. శుక్రవారం కొలంబోలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్, శ్రీలంక మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రక్షణ, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.