Personal Data Protection Bill: ఇకపై దేశంలోని ప్రతి పౌరుడి పర్సనల్ డాటా సురక్షితంగా ఉండనుంది. పర్సనల్ డేటాను ఎవరైనా వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేసినట్టయితే అటువంటి వ్యక్తులు, సంస్థలకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2023ని నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేయడంతో పాటు వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కొరడా ఝుళిపించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు- 2023 (Digital Personal Data Protection Bill 2023)’ లోక్‌సభ ముందుకొచ్చింది. విపక్షాల ఆందోళనల నడుమ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీన్ని లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని ద్రవ్య బిల్లుగా తీసుకొచ్చారన్న విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సాధారణ బిల్లుగానే ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
Read also: Nabha Natesh: ఒంపుసొంపులన్నీ చూపిస్తూ కవ్విస్తోన్న నభా నటేష్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (DPDP 2023)లో ముసాయిదా బిల్లుతో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన అనేక నిబంధనలు సడలించారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం.. ఏదైనా కంపెనీ సమాచార దుర్వినియోగానికి పాల్పడితే.. గరిష్ఠంగా రూ. 250కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా.. సమాచార దుర్వినియోగానికి పాల్పడినా సదరు కంపెనీలపై కనిష్ఠంగా రూ.50కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. ఈ చట్టం అమలు కోసం ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈ బోర్డు, దాని సభ్యులు, ఉద్యోగులు, అధికారులపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు ఉండవని బిల్లులో తెలిపారు. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బోర్డు రిఫరెన్స్‌తో కేంద్రం ఏదైనా సమాచారాన్ని బ్లాక్ చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనిపై కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘ఆన్‌లైన్ వేదికల్లో వ్యక్తుల సమాచార దుర్వినియోగం విపరీతంగా జరుగుతోంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. ప్రతి పౌరుడి డిజిటల్ హక్కులకు రక్షణ లభిస్తుందని తెలిపారు.