నూతన సంవత్సరం సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్ హాట్ స్ప్రింగ్స్, పూంచ్ రావల్ కోట్, చకోటి ఉరి, చిల్లియానా తివాల్ క్రాసింగ్ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ‘2022 సంవత్సరం ప్రారంభంలో, పరస్పర విశ్వాసం, ప్రశాంతతను పెంపొందించడానికి, పూంచ్, మెంధార్ క్రాసింగ్ పాయింట్ల వద్ద భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంతో స్వీట్లు పంచుకుంది` అని జమ్మూ ఆధారిత రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు.
Read Also:పెన్షన్ల కోసం రూ.18,000 కోట్లు ఖర్చు చేశాం: పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో కొనసాగుతున్న కాల్పుల విరమణను పరిగణనలోకి తీసుకుంటే, జమ్మూ, కాశ్మీర్‌లలో శాంతి, సామరస్యాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఈ సంజ్ఞను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఇప్పటికే పాక్ భారత్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న సంగతి తెల్సిందే. ఈ ఏడాది అయిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని కోరుకుంటున్నామని కల్నల్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు.