ఉత్తర భారత్‌ను ఈ ఏడాది భారీ వర్షాలు ముంచెత్తాయి. కౌడ్ల బరస్ట్ కారణంగా జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక రావి నది ఉధృతి కారణంగా పంజాబ్ సరిహద్దు బెల్టు అంతటా విధ్వంసం సృష్టించింది.
జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో బాలిక, బాలుడి మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. రాజస్థా్న్‌లోని జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దులో కుళ్లిపోయి ఉన్న రెండు మృతదేహాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకుంది.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో తన పరిపాలనా వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం లాంటి పరిస్థితిని నివారించడంలో అమెరికా పెద్ద దౌత్య విజయాన్ని సాధించిందని చెప్పారు. అయితే ఈ అంశంలో తనకు సరైన క్రెడిట్ ఇవ్వలేదని ట్రంప్ శనివారం ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధార్ హాట్ స్ప్రింగ్స్, పూంచ్ రావల్ కోట్, చకోటి ఉరి, చిల్లియానా తివాల్ క్రాసింగ్ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ‘2022 సంవత్సరం ప్రారంభంలో, పరస్పర విశ్వాసం, ప్రశాంతతను పెంపొందించడానికి, పూంచ్, మెంధార్ క్రాసింగ్ పాయింట్ల వద్ద భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంతో స్వీట్లు పంచుకుంది` అని జమ్మూ ఆధారిత రక్షణ…
కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఇండో-పాక్ సరిహద్దుకు వెళ్లనున్నారు. ఒక రోజు రాత్రి అక్కడే గడపనున్నారు. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని జైసల్మీర్‌లో అమిత్ షా పర్యటించనున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉండనున్నారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో గడిపిన మొదటి హోం మంత్రిగా అమిత్ షా నిలువనున్నారు.బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యనేతలు తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు వెళుతున్నారు. దీపావళి సమయంలో కాశ్మీర్…