Kiren Rijiju: రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు.. చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షం వాకౌట్ సాకు
- రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
- చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షం వాకౌట్ సాకు..
- ఈ బిల్లుకు క్రైస్తవ సమాజం కూడా మద్దతు ఇస్తోంది: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై వాడీ వేడి చర్చ కొనసాగుతుంది. వక్ఫ్ బిల్లు మీద చర్చించడానికి కేటాయించిన సమయంపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఇక, ఈరోజు లోక్ సభలో అధికార, విపక్షాల మధ్య మాటాల యుద్ధం నడిచింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నియంత్రించడంతో పాటు వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చే బిల్లుపై చర్చ నుంచి తప్పించుకోవడానికే ప్రతిపక్షాలు వాకౌట్ ను ఒక సాకుగా చెబుతున్నాయని ఆరోపించారు.
Read Also: ‘Mad Square’ : ‘మ్యాడ్ స్క్వేర్’ 4 డే కలేక్షన్ పై లేటెస్ట్ అప్డేట్..
Also Read
- Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
ఇక, రేపు (ఏప్రిల్ 2న) కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుపై చర్చించేందుకు ఎనిమిది గంటలు కేటాయించింది అని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బిల్లుకు క్రైస్తవ సమాజం కూడా మద్దతు ఇస్తోంది అని గుర్తు చేశారు. కేరళకు చెందిన కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని అభివర్ణించిందని ఆయన తెలిపారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రేపు వక్ఫ్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి కేంద్రం యోచిస్తుంది.
తాజావార్తలు
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!