OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
- టీడీపీకి తలనొప్పిగా లాస్ట్ మినిట్ నిర్ణయాలు..
- గుర్ల జడ్పీటీసీ ముందు జనసేనకు, ఫైనల్‌గా టీడీపీకి..
- నేరుగా తలపడుతున్న జనసేన, టీడీపీ అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీపురుపల్లిలో టీడీపీకి చెమటలు పడుతున్నాయా? సీట్ల సర్దుబాటు, టిక్కెట్ల కేటాయింపు విషయంలో తీసుకున్న లాస్ట్ మినిట్ నిర్ణయాలు తేడా కొట్టే ప్రమాదం ఉందా? చివరి నిమిషంలో మారిన అభ్యర్థులు, సీట్లు కూటమి మిత్రపక్షాల మధ్య అసంతృప్తికి కారణం అవుతున్నాయా? ఎక్కడెక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో సందేహాలు పెరుగుతున్నాయి? లెట్స్ వాచ్.
విజయనగం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సిన మిత్రపక్షాలే ఇప్పుడు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. సీట్ల సర్దుబాటులో పొత్తు ధర్మం పాటిస్తామని చెప్పిన కూటమి నాయకత్వం.. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారాయని అంటున్నారు. గుర్ల జెడ్పీటీసీ సీటును తొలుత జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కంది దీపిక నామినేషన్ వేశారు.
Also Read
ఉపసంహరణ గడువుకు గంట ముందు వరకు ఆమే కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కానీ… అనూహ్యంగా చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి చనమల్ల రాధను బరిలోకి దించారు. దీంతో జనసేన, టీడీపీ అభ్యర్థులు నేరుగా తలపడే పరిస్థితి వచ్చింది. అటు చీపురుపల్లి జెడ్పీటీసీ స్థానంలోనూ ఇదే తరహా పరిణామం జరిగింది. మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు కుమారుడికి టికెట్ వస్తుందన్న ఆశతో దుబాయ్ నుంచి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కానీ… చివరి నిమిషంలో చిన్నశ్రీను వర్గానికి చెందిన వలిరెడ్డి శ్రీను భార్యకి టికెట్ ఖాయం చేయడంతో కామునాయుడు వర్గం అసంతృప్తిగా ఉంది.
ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు అన్యాయం చేశారంటూ మండిపడుతోంది ఆ గ్రూప్. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడి వ్యవహారం కూడా కూటమి సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తొలుత ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయనతో చివరకు విత్‌డ్రా చేయించారు. ఇలా ఒకవైపు జనసేనకు కేటాయించిన స్థానంలో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టడం.. మరోవైపు బీజేపీ నాయకుడి నామినేషన్ ఉపసంహరణ.. ఇంకోవైపు సొంత పార్టీలోనే టికెట్ ఆశించి భంగపడిన నాయకుల అసంతృప్తి.. ఇవన్నీ కూటమి ఐక్యతను ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఇక్కడే టీడీపీకి అసలు చిక్కు ఎదురవుతోందంటున్నారు.
పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి చెందిన ఓట్లు తమ అభ్యర్థులకు బదిలీ అవుతాయని టీడీపీ ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. టికెట్ కేటాయింపుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తితో మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు మౌనంగా ఉంటే.. ఆ ఓట్లు ఎవరికి వెళ్తాయి, తమకు ఎలా బదిలీ అవుతాయన్న ప్రశ్నలు టీడీపీ వాళ్ళను వేధిస్తున్నాయట. ఎన్నికల సమయంలో నాయకుల మధ్య కుదిరే ఒప్పందాల కంటే కేడర్ మధ్య ఉండే సమన్వయమే కీలకం.
కానీ చీపురుపల్లి నియోజవర్గంలో టికెట్ల కేటాయింపుతో ఏర్పడిన విభేదాలు ఆ సమన్వయానికి సవాలుగా మారాయన్న చర్చ నడుస్తోంది. కలిసుంటేనే కూటమిగానీ.. విడివిడిగా పోటీ చేస్తే తేడా కొడుతుందన్న భయాలు కేడర్ని వెంటాడుతున్నాయట. పొత్తు ధర్మాన్ని పక్కనపెట్టి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీకి గుబులు పుట్టిస్తున్నాయన్నది చీపురుపల్లి టాక్.
తాజావార్తలు
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!