Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
- రాత్రికి రాత్రే 90 శాతం ఉద్యోగులకు ఉద్వాసన..?
- ఇన్నోటెక్ ఇండియాలో భారీ లేఆఫ్..
- ఇండియాతో పాటు అమెరికా, ఫిలిప్పీన్స్‌లో కూడా తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Innodata Layoffs: సాఫ్ట్వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి టెక్ సంస్థలు. ఇదిలా ఉంటే, ప్రముఖ అవుట్సోర్సింగ్ సంస్థ ఇన్నోడేటా ఇండియా దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సంస్థలో ప్రధాన క్లయింట్‌గా ఉన్న మెటా తన ప్రాజెక్ట్ పనుల్ని ఉపసంహరించుకోవడంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని, అందుకే ఈ భారీ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.
రాత్రికి రాత్రే 90 శాతం మందికి ఉద్వాసన..?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇన్నోడేటా ఇండియాలో సుమారు 1000 నుంచి 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మందిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి 4 నెలల జీతానికి సమానమైన సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తున్నట్లు సమాచారం. అయితే, దీంట్లో నోటీస్ పీరియడ్‌కు సంబంధించిన చెల్లింపులు, ఇతరాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ తొలగింపులు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, అమెరికా, ఫిలిప్పీన్స్‌లో కూడా ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read
- ISRO NVS-03 Satellite: నేడు రాత్రి 11:51 గంటలకు ఇస్రో కీలక ప్రయోగం.. నింగిలోకి NVS-03 ఉపగ్రహం!
- మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
- IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
ఎమర్జెన్సీ మీటింగ్, సిస్టమ్ యాక్సెస్ నిలిపివేత..
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆకస్మికంగా జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెడ్డిట్‌లో ఓ ప్రాసెస్ అనలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగులను అకస్మాత్తుగా ఎమర్జెన్సీ హెచ్ఆర్ మీటింగ్‌కు పిలిచారు, ప్రధాన క్లయింట్ మెటా పనులు తగ్గించడంతో తమ ఉద్యోగాలు అవసరం లేదని మీటింగ్‌లో చెప్పినట్లు ఆరోపించారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఉద్యోగులు ప్రశ్నలు అడగకుండా మైక్రోఫోన్లు మ్యూట్ చేశారని సదరు ఉద్యోగి ఆరోపించారు. మీటింగ్ పూర్తయిన గంటలోపే ఉద్యోగులకు యాక్సెస్ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆఫీస్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకునేందు వాట్సాప్‌ను ఆశ్రయించినట్లు ఉద్యోగి వివరించారు.
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!