Waqf Act: ఈ రోజు నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంట్ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
Waqf Bill: ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’ని పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారబోతోంది. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు బిల్లుకు మద్దతు పలికాయి. కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, ఎంఐఎం, టీఎంసీ వంటి ఇండీ కూటమి పా�
వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఇక బిల్లు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే చట్టంగా మారనుంది. బిల్లు చట్టంగా మారకముందే సుప్రీంకోర్టు తలుపులు తట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.
పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇది కీలక పరిణామం అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మొత్తానికి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి వంతు వచ్చింది. ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. చట్టం అమల్లోకి రానుంది.
Kiren Rijiju: రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు-2025, ది ముస్లమాన్ వక్ఫ్ రద్దు బిల్లు-2025 రెండు బిల్లులను పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశ పెట్టారు.
రాజ్యసభలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తూ బీజేపీ అనురాగ్ ఠాకూర్‌పై విరుచుకుపడ్డారు.
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. గురువారం రాజ్యసభలోకి వెళ్లే ముందు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇక ఇదే బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. కేవలం ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు.