PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
- ‘‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’’..
- ఖర్గే వ్యాఖ్యలుకు మోడీ స్ట్రాంగ్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ‘‘ నా జీవితంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల పాట్నాలో జరిగిన సమావేశంలో ‘‘మోడీ నాన్న కూడా వెళ్లిపోతారు’’ అని వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని కుటుంబాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు మోడీ కౌంటర్ ఇచ్చారు.
గుజరాత్ బనస్కాంత జిల్లా భిల్డి పట్టణంలో భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం మోదీ సభలో ప్రసంగించారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.14,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
Also Read
- Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
- Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
- Rahul Gandhi: ‘‘ఢిల్లీ ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డంకులు’’.. కేంద్రంపై రాహుల్ ఆరోపణలు..
- Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
దేశ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు కొందరు సంతోషిస్తున్నారని మోడీ విమర్శించారు. దేశానికి కష్టం వచ్చిన ప్రతీసారి వారు ఆనందిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమాసియా పరిణామాలో రైతులకు ఎరువులు అందడం లేదని కొందరు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మోడీని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, వంటగ్యాస్ దొరకడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత రైతులకు ఎరువుల కొరత రానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోడీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువులు ధరలు పెరిగాయని, అయినప్పటికీ భారత రైతులపై భారం పడకుండా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డీఏపీ బస్తా ధర రూ.5,000 దాటినా, భారత రైతులు దానిని రూ.1,350కే పొందుతున్నారని చెప్పారు. గుజరాత్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడతను కూడా మోదీ విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!