టాలీవుడ్ నుంచి భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ కామెడీ, లవ్, ఫ్రెండ్షిప్ అంశాలతో యూత్ ను ఆకట్టుకుంటోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా రిలీజ్ అయిన చిత్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ వైపే యూత్, మిగతా ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఇక ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ కాస్త తగ్గినా ఫస్ట్ షో, సెకండ్ షోలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి.
Also Read: Mad Square : రివ్యూస్ పై నిర్మాత నాగవంశీ ఫైర్..
ఇక కలెక్షన్ ల విషయానికి వస్తే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి 17 కోట్ల గ్రాస్ వసూల్ అవ్వడం విశేషం. ఇక ఇండియాలో మాత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే2న కూడా అదే రేంజ్ లో వసూళ్లు అందుకుంది. ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో శనివారం కావడంతో మరింత జోరుగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.8.6 కోట్ల నెట్ అందుకుంది. దీంతో 2 రోజులకు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.17.1 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు అందుకుంది. కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ఓవరాల్‌గా 69.4 కొట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ టీం తెలిపింది. ఇక గతంలో వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లు రాబట్టగలిగింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ లాంగ్ రన్ లో ఎంత వసూల్ చేస్తుందనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం థియేటర్లలో ‘L2 : ఎంపురాన్’,‘రాబిన్ హుడ్’, ‘వీర ధీర శూర’.. వంటి చిత్రాలు కూడా ఓ మాదిరిగా రన్ అవుతున్నాయి. వీటితో పోటి పడి మరి ‘మ్యాడ్ స్క్వేర్’ వసూళ్లు రాబట్టే ప్రయత్నం చేస్తోంది.