Manipur: గతేడాది కాలంలో మణిపూర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణ ఆ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. ఈ రెండు తెగల మధ్య ఆధిపత్య పోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణలు మతం రంగును పులుముకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని సేనాపతి జిల్లాలో కొందరు వ్యక్తులు రాత్రిపూట శివాలయాన్ని ధ్వంసం చేశారు.