NIA: శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌పై దాడి కేసు.. పంజాబ్, హర్యాల్లో ఎన్ఐఏ దాడులు..
NIA: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ మేరకు పంజాబ్, హర్యానాలోని 14 ప్రాంతాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు చేసింది. పంజాబ్‌లోని మోగా, జలంధర్, లూథియానా, గురుదాస్‌పూర్, మొహాలీ, పాటియాలా, హర్యానాలోని కురుక్షేత్ర, యమునానగర్ జిల్లాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
మార్చి 19, జూలై 2న శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌పై జరిగిన దాడుల వెనక కుట్రను ఛేదించడానికి పలు ప్రదేశాల్లో రైడ్స్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ దాడిలో నేరపూరిత చొరబాటు, విధ్వంసం, ప్రజా ఆస్తులకు నష్టం, కాన్సులేట్ అధికారులను గాయపరచడం, భవనాలకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికార ప్రతినిధి వెల్లడించారు.
Also Read
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
Read Also: ‘Panauti’ row: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
తాజాగా రెండు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో విలువైన సమాచారంతో పాటు నేరారోపణ పత్రాలతో కూడిన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. దాడి చేసిన వారిని గుర్తించి, వారిని విచారించిందేకు సిద్ధమవుతున్నామని, భారత వ్యతిరేక శక్తులకు బలమైన సందేశం పంపండంలో భాగంగా ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది.
మార్చి 18-19 మధ్య రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై కొన్ని ఖలిస్తాన్ అనుకూల శక్తులు దాడులు చేశాయి. ఈ దాడి తర్వాత జూలై 2న కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాయి. ఈ కేసును విచారించేందుకు ఎన్ఐఏ ఆగస్టులో శాన్‌ఫ్రాన్సిస్కోను సందర్శించింది. ఈ దాడిలో పాల్గోన్న యూఎస్ సంస్థలు, వ్యక్తుల సమాచారాన్ని గుర్తించడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్‌పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్‌లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!