NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEC Lavie X14: జపాన్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ NEC సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. భారీ 99.9Wh బ్యాటరీతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ దీని బరువు కేవలం 1 కిలోగ్రామ్ మాత్రమే. NEC Lavie X14 పేరుతో విడుదలైన ఈ ఫ్లాగ్షిప్ ల్యాప్‌టాప్‌లో శక్తివంతమైన Intel Core Ultra 7 355 ప్రాసెసర్, 32GB RAM, 512GB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 30 గంటల వరకు బ్యాకప్ అందించగలదని కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్‌ను జపాన్ మార్కెట్లో మాత్రమే విడుదల చేశారు. NEC, Lenovo భాగస్వామ్యంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు.
NEC Lavie X14 ల్యాప్‌టాప్ ఫీచర్లు ఇవే
NEC Lavie X14లో 14 అంగుళాల డిస్ప్లేను అందించారు. ఇది FHD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. స్లిమ్ డిజైన్‌తో పాటు తక్కువ బరువు ఉండటం ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారు, ఆఫీస్ పనుల కోసం ల్యాప్‌టాప్ ఉపయోగించే వారికి ఇది అనువైన ఎంపికగా ఉండనుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో Intel Core Ultra 7 355 చిప్‌సెట్‌ను అందించారు. ఇది AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. దీనికి 32GB LPDDR5x RAM, 512GB స్టోరేజ్ జత చేశారు. ఈ ప్రాసెసర్ Cinebench 2024 బెంచ్‌మార్క్ టెస్టులో 650 పాయింట్ల స్కోర్ సాధించినట్లు నివేదిక పేర్కొంది. ఈ స్కోర్ Apple M3 ప్రాసెసర్ కంటే సుమారు 5 శాతం ఎక్కువగా ఉందని ప్రచురితమైన వివరాలు చెబుతున్నాయి. అయితే బెంచ్‌మార్క్ ఫలితాలు పరీక్షించిన సిస్టమ్, పనితీరు పరిస్థితులను బట్టి మారవచ్చు.
Also Read
- చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
- Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
- Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
- Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
99.9Wh బ్యాటరీ.. 30 గంటల వరకు బ్యాకప్!
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రధాన ఆకర్షణ 99.9Wh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 30 గంటల వరకు బ్యాకప్ అందించగలదని కంపెనీ పేర్కొన్నట్లు సమాచారం. సాధారణంగా పెద్ద బ్యాటరీలు ఉన్న ల్యాప్‌టాప్‌ల బరువు ఎక్కువగా ఉంటుంది. కానీ NEC Lavie X14 బరువు కేవలం 1 కిలోగ్రామ్ మాత్రమే కావడం విశేషం. భారీ బ్యాటరీ, తక్కువ బరువు కలయికతో ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్ కోసం ఇందులో 1080p IR కెమెరాను అందించారు. అలాగే మల్టీటచ్ ట్రాక్‌ప్యాడ్, జెస్చర్ సపోర్ట్ కూడా ఉన్నాయి.
కనెక్టివిటీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
NEC Lavie X14లో కనెక్టివిటీ కోసం పలు పోర్టులను అందించారు. ఇందులో రెండు Thunderbolt 4 Type-C పోర్టులు ఉన్నాయి. వీటితో పాటు రెండు USB 3.2 Gen 2 Type-A పోర్టులు కూడా ఉన్నాయి. ఇతర కనెక్టివిటీ ఫీచర్లలో HDMI, MicroSD కార్డ్ సపోర్ట్, Ethernet (LAN), Wi-Fi 7, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. దీంతో ల్యాప్‌టాప్‌కు ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవడం సులభమవుతుంది.
NEC Lavie X14 ధర ఎంత?
NEC Lavie X14 ల్యాప్‌టాప్‌ను జపాన్‌లో 3,64,870 యెన్ ధరతో విడుదల చేశారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2,20,491గా ఉంటుంది. అయితే ఇది కరెన్సీ మార్పిడి ఆధారంగా లెక్కించిన అంచనా మాత్రమే. భారతదేశంలో అధికారికంగా విడుదల చేస్తే ధర మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ జపాన్ మార్కెట్‌కే పరిమితమైంది. భారత్‌లో విడుదలకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!