Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zakir Naik: తమ విద్వేషపూరిత ప్రసంగాలు, ఆర్థిక నేరాల ఆరోపణలతో భారతదేశం నుంచి పారిపోయి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న ఇస్లామిక్ ప్రచారంకుడు జకీర్ నాయక్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు బాలికల విద్యపై విధించిన నిషేధాన్ని సమర్థిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సాధారణంగా అనేక అంశాలపై భిన్న అభిప్రాయాలు ఉండే భారతీయులు, పాకిస్థానీలు, అలాగే ఆఫ్ఘన్లు.. నాయక్ వ్యాఖ్యలను ఖండించడంలో మాత్రం ఒక్కటయ్యారు. నాయక్ మాటలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం నాయక్ ఇటీవల విడుదల చేసిన ఒక వీడియో క్లిప్. అందులో అతను మాట్లాడుతూ.. తాలిబన్లు బాలికలకు సెకండరీ, ఉన్నత విద్యను శాశ్వతంగా అడ్డుకోలేదని, కేవలం భద్రతా కారణాలు, మహిళా ఉపాధ్యాయుల కొరత వల్లే తాత్కాలికంగా వాయిదా వేశారని వింత వాదన తీసుకొచ్చారు. తాలిబన్ ప్రతినిధులతో తాను స్వయంగా మాట్లాడానని, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదని చెప్పారు. సరిపడా మహిళా టీచర్లు లభించే వరకు విద్యను వాయిదా వేస్తే తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆఫ్ఘన్ మహిళలు ప్రస్తుతం ఇస్లామిక్ స్టడీస్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీలు చేస్తున్నారని, కాబట్టి వారికి ఉన్నత విద్య లేదనడం తప్పుడు ప్రచారమని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
Also Read
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- Donald Trump: "అబ్దుల్.. నువ్వొక జిహాదీవి".. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
- CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
అయితే, జకీర్ నాయక్ వ్యాఖ్యలు పూర్తి అబద్ధాలని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి (యుఎన్), యునిసెఫ్ (UNICEF) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యునిసెఫ్ నివేదిక ప్రకారం, 2021 ఆగస్టు 15న తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 26 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్ బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారు. 2021 సెప్టెంబర్ నుంచి ఆరో తరగతి దాటిన బాలికలకు పాఠశాల ప్రవేశాన్ని నిలిపివేయగా, 2022 డిసెంబర్ నాటికి మహిళలను యూనివర్సిటీల నుంచి కూడా నిషేధించారు. చివరికి 2024 డిసెంబర్ నాటికి నర్సింగ్, మిడ్వైఫరీ వంటి వైద్య సంబంధిత కోర్సుల్లో కూడా మహిళలు చేరకూడదని తాలిబన్ ప్రభుత్వం ఆంక్షలు పెంచింది. ప్రపంచంలోనే మహిళలకు సెకండరీ, ఉన్నత విద్యను పూర్తిగా మూసివేసిన ఏకైక దేశంగా నేటికీ ఆఫ్ఘనిస్థాన్ మిగిలిపోయింది.
ఇక, జకీర్ నాయక్ లాజిక్‌ను ఆఫ్ఘన్ మేధావులు, విశ్లేషకులు తీవ్రంగా ఎండగట్టారు. బెల్జియంలో నివసిస్తున్న మాజీ ఆఫ్ఘన్ భద్రతా బలగాల సభ్యుడు అజీమ్ షిన్వారీ స్పందిస్తూ.. “బాలికలను చదువుకోనివ్వకపోతే, భవిష్యత్తులో దేశానికి కావలసిన మహిళా ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు?” అని ప్రశ్నించారు. అలాగే నాయక్ చెప్పే పీహెచ్‌డీల క్లెయిమ్‌లకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. గతంలో సౌదీ అరేబియాలో తాలిబన్ నిఘా విభాగం ప్రతినిధులతో నాయక్ రహస్యంగా సమావేశమయ్యారని కూడా షిన్వారీ గుర్తుచేశారు. ఆఫ్ఘన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ సభ్యురాలు మరియం సులైమాన్ఖిల్ ఎద్దేవా చేస్తూ, “చదువుకోవడానికి ఆడ టీచర్లు కావాలి, కానీ ఆ మహిళా టీచర్లను పని చేయకుండా నిషేధించింది తాలిబన్లే.. ఎంత గొప్ప లాజిక్ డాక్టర్ నాయక్!” అంటూ ట్విట్టర్ (X) వేదికగా చురకలంటించారు. మరోవైపు.. ‘ఆఫ్ఘన్ ఇంటర్నేషనల్ పష్తో’ ఎడిటర్ మహబూబ్ షా మహబూబ్ స్పందిస్తూ.. బడులు మూసివేస్తే టీచర్లు ఆకాశం నుంచి ఊడిపడతారా అని ప్రశ్నించారు. ఆఫ్ఘన్ సంతతికి చెందిన అమెరికన్ జర్నలిస్ట్ లీనా రోజ్బిహ్ మాట్లాడుతూ.. తాలిబన్ల నిర్ణయాలను అంతగా సమర్థిస్తున్నప్పుడు జకీర్ నాయక్ మలేషియా వదిలి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లి తాలిబన్ల పాలనలో బతకాలని హితవు పలికారు. మరోవైపు నొబెల్ గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ తండ్రి, పాకిస్థానీ విద్యావేత్త జియావుద్దీన్ యూసుఫ్‌జాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!