INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- ఖర్గే ఇంటిలో నేడు ‘‘ప్రజా అభిశంసన’’ కార్యక్రమం..
- జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్..
- రాహుల్ సహా ప్రతిపక్ష నేతలు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Bloc: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై శనివారం ఇండియా కూటమి న్యూఢిల్లీలో ‘‘ప్రజా అభిశంసన’’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ‘‘మాక్-అభిశంసన’’ కార్యక్రమం జరగనునంది. నిజానికి ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా శనివారానికి వాయిదా వేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, వామపక్ష పార్టీలు పాల్గొననున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు సామాజిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్పెషల్ ఇంటెన్సివ్ (SIR)ను వ్యతిరేకించేవారు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఆమె యూపీఏ ప్రభుత్వం సమయంలో 2009 నుంచి 2014 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.
Also Read
ఈ డమ్మీ-అభిశంసన కార్యక్రమం ఎలా జరగనుంది.?
ఈ కార్యక్రమాన్ని పార్లమెంటరీ విధానాన్ని అనుసరించి నిర్వహించబోతున్నారు. మీరా కుమార్ సభకు అధ్యక్షత వహిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు తమకు కేటాయించిన సమయానికి అనుగునంగా తీర్మానంపై మాట్లాడుతారు. చివరగా రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గురువారం ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల మీటింగ్ జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, మీరా కుమార్, సీపీఎం నేత జాన్ బ్రిటాస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రియన్, సమాజ్‌వాదీ పార్టీ నేత హరేంద్ర మాలిక్, జేఎంఎం నేత మహువా మాజి తదితరులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని అశోక హోటల్లో నిర్వహించాలని భావించారు, ఆ తర్వాత జంతర్ మంతర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. అనుమతులు రాకపోవడంతో చివరకు ఖర్గే నివాసంలో అభిశంసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాహుల్, అఖిలేష్‌కు అమిత్ షా సవాల్..
ఇదిలా ఉంటే, మాక్ అభిశంసన కార్యక్రమానికి ఒక రోజు ముందు అమిత్ షా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లకు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు చేస్తున్న ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలపై పార్లమెంట్లో చర్చలకు రావాలని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, చర్చకు రావడానికి మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కష్టపడి సాధన చేయకుండా అంపైర్‌ను నిందించే క్రికెట్ జట్టుతో రాహుల్, అఖిలేష్ యాదవ్ ఉన్నారు. ’’ అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!