Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. మే 7న జరిగిన ఈ దాడులకు సంబంధించి కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులను ‘‘ఆపరేషన్స్ రూమ్’’ నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులు పర్యవేక్షిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ డికె త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్, ఒక సీనియర్ ఆర్మీ అధికారి యుద్ధ గదిలో ఉన్నట్లు చూపించే రెండు కొత్త చిత్రాలు విడుదలయ్యాయి. మరో ఫోటోలో మే 7 ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తెల్లవారుజామున 1.05 గంటలకు జనరల్ ద్వివేది, సీనియర్ అధికారి స్క్రీన్ చూస్తున్నట్లుగా ఉంది. ఆపరేషన్ సమయంలో రియల్ టైమ్ అప్డేట్స్ చూస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ప్రిసైజ్డ్-గైడెడ్ బాంబులు, స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ఫైటర్ జెట్స్ ద్వారా ప్రయోగించి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాము. మొత్తం 140 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు.
Read Also: PM Modi: ప్రశాంతత కావాలంటే రోటీ తినండి.. లేదంటే బుల్లెట్ దిగుతుంది.. పాక్‌కు మోడీ హెచ్చరిక
భారత దాడిలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లోని రెండు స్థావరాలతో పాటు బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్, చకమ్రు, కోట్లి, భింబర్, గుల్పూర్లలో లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం), హిజ్బుల్ ముజాహిదీన్ మరియు ఇతర అనుబంధ నెట్‌వర్క్‌లు ఉపయోగించిన కీలకమైన లాజిస్టికల్, ఆపరేషనల్, శిక్షణ మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. మురిద్కేలో హఫీజ్ సయీద్ నడుపుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహల్వాపూర్ మసూద్ అజార్ నడుపుతున్న జైష్-ఏ-మొహమ్మద్ సంస్థకు స్థావరాలను గురిచూసి కొట్టారు.
ఈ దాడుల తర్వాత పాక్ సైన్యం భారత దేశంలోని సివిల్, మిలిటరీ మౌలికసదుపాయాలను టార్గెట్ చేస్తూ డ్రోన్స్, క్షిపణి దాడికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా భారత్ వాయుసేన సర్గోధా, నూర్ ఖాన్ (చక్లాలా), భోలారి, జాకోబాబాద్, సుక్కుర్, రహీమ్ యార్ ఖాన్, స్కర్డు, పస్రూర్, మురిద్, రఫీకి, చునియన్ స్థావరాలను, మొత్తం 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ భీకరదాడి చేసింది.
Indian Army has released a booklet to its personnel on #OperationSindoor where it has shown the Indian Army Operations Room from where the operation was being monitored by top military brass, including Army chief Gen Upendra Dwivedi, Navy chief Admiral Dinesh K Tripathi and Air… pic.twitter.com/FiIoHsvjVH
— ANI (@ANI) May 26, 2025