Farmers Suicide: కర్ణాటకలో 15 నెలల్లో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య.. కారణమిదే
- కర్ణాటకలో 15 నెలల్లో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య
- రైతు ఆత్మహత్యలకు కారణం కరువు.. పంట నష్టం.. రుణభారం
- అత్యధికంగా బెలగావిలో 122.. హవేరిలో 120 రైతు ఆత్మహత్యలు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. గత 15 నెలల వ్యవధిలో 1,182 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం మరియు విపరీతమైన అప్పులు అని రెవెన్యూ శాఖ పేర్కొంది. కర్ణాటకలో అత్యధికంగా బెలగావి, హవేరి మరియు ధార్వాడ్‌లోని మూడు జిల్లాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బెలగావిలో 122, హవేరిలో 120, ధార్వాడ్ లో 101 మంది సూసైడ్ చేసుకున్నారు.
Read Also: PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
మరోవైపు.. చిక్కమగళూరులో 89 మంది, కలబుర్గిలో 69 మంది, యాదగిరిలో 68 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నాటకలోని 27 జిల్లాల్లో 6 జిల్లాల్లో రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారు సింగిల్ డిజిట్ లో నమోదు కాగా.. మిగిలిన 21 జిల్లాల్లో 30 లేదా అంతకంటే ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిక్కబళ్లాపూర్, చామరాజ్‌నగర్‌లో రెండేసి రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.
Read Also: Manchu Family: మళ్ళీ బయటపడ్డ విభేదాలు.. పేరు ప్రస్తావించుకోడానికి కూడా ఇష్టపడని మంచు బ్రదర్స్
గత సెప్టెంబరు నెలలో కర్నాటకలోని చెరకు అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల (APMC) మంత్రి శివానంద్ పాటిల్, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పడం వివాదానికి దారితీసింది. పంట నష్టాలు, రుణాలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు ఈ పరిహారం చెల్లించాలని కోరుతున్నాయన్నారు. ఇదిలా ఉంటే.. పాటిల్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. ‘సొంత కారణాలతో’ ఆత్మహత్య చేసుకున్న వారిని రైతులు అని పిలవలేమని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!